సారంగ ధరియా పాట పాడిన కొరియా అమ్మాయి... వైరల్ అవుతున్న వీడియో

12-09-2021 Sun 19:23
advertisement

తెలుగు సినిమా, తెలుగు సినిమా పాట అంతర్జాతీయ గుర్తింపు అందుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో బాగా హిట్టయిన పాటల్లో సారంగ దరియా ఒకటి. జానపద శైలిలో సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించగా, శ్రోతల నుంచి విశేష స్పందన వచ్చింది. కాగా, ఈ పాట కొరియా దేశస్తులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ కొరియా యువతి సారంగ దరియా పాటను ఆలపించగా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కొరియన్ యువతి తాను ఆలపించిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయగా 8.70 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆ యువతి తన పేరును వెల్లడించలేదు. తన యూట్యూబ్ చానల్లో మాత్రం కొరియన్ జీ1 అని పేర్కొంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రంలోనిదే ఈ సారంగ దరియా పాట.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement