ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు ప్రత్యేక హోదా ఇవ్వండి.. కేంద్రానికి విజయసాయి నేతృత్వంలోని స్థాయీ సంఘం సిఫార్సు

12-09-2021 Sun 08:53
Give special status to AP Chhattisgarh and Jharkhand urge vijayasaireddys committee

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్రానికి కీలక సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాజధానులు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ సహా చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి  సిఫార్సు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయసాయిరెడ్డి నిన్న ఇందుకు సంబంధించిన నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడికి అందించారు. జమ్మూకశ్మీర్‌ ఇటీవలి వరకు ప్రత్యేకస్థాయితోపాటు ప్రత్యేక కేటగిరీ  హోదాను అనుభవించిందని, దానిని జమ్మూకశ్మీర్, లడఖ్‌లుగా విభజించిన తర్వాత 2021-22 కేంద్ర బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్‌కు రూ. 1.08 లక్షల కోట్లు, లడఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించారని ఆ నివేదికలో పేర్కొన్నారు.

ఈ కేటాయింపుల వల్ల ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న స్థాయీ సంఘం.. ఇలాంటి పరిహారాన్నే రాజధానులు కోల్పోయిన ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అలాగే, పదేళ్లపాటు ఈ మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను విడగొట్టొద్దని కూడా కోరింది. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ ఇంకా పరిశీలన దశలోనే ఉండడంపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాల్తేరు డివిజన్‌ను ఎందుకు విడగొట్టాల్సి వస్తుందో తమకు అర్థం కావడం లేదన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరింది. మిరప ఎగుమతులకు కేంద్రమైన గుంటూరులో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం ఆ నివేదికలో కేంద్రానికి సిఫార్సు చేసింది.


More Telugu News
Good responce for Enemy Trailer
lovers commits suicide
Radhe Shyam movie update
babar azam on t20 match
ashish mishra joins in hospital
AP High Court serious on Ap Police on TDP Leader Pattabhi arrest
corona bulletin in inida
TDP team to meet president ramnath kovind tomorrow
municipal officials remove shops in Dharmavarm market
Baby Rani Maurya says women shouldnt go to police stations after dark
Odisha Man sold his wife in Rajasthan for one lakh
ap govt shocks village and ward employees
Pakistan asks TV channels to ban hug scenes Govt odered
Matchboxes to cost Rs 2 from Dec 1
Bathukamma video On burj khalifa
..more