'పుష్ప' వారం రోజుల ముందుగానే రానుందట!

11-09-2021 Sat 18:02
advertisement

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణపరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలలో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ జోడీగా రష్మిక నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే అందుకు ఒక వారం రోజుల ముందుగానే .. అంటే డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని తాజాగా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ అంచనాలు పెంచుతూ వెళుతోంది. ఆ మధ్య వచ్చిన ఫస్టు సింగిల్ కూడా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.      

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement