ప్రభుత్వ అధికారిగా కనిపించనున్న నితిన్!

11-09-2021 Sat 10:32
advertisement

నితిన్ తన 31వ సినిమాను మొదలుపెట్టేశాడు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. నిన్న సాయంత్రం ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమామకి 'మాచర్ల నియోజక వర్గం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

టైటిల్ ను బట్టి ఇది రాజకీయాల నేపథ్యంలో సాగే కథ అనే విషయం అర్థమవుతోంది. పోస్టర్ ను బట్టి యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో నిజాయతీపరుడైన ఒక ప్రభుత్వ అధికారిగా నితిన్ కనిపించనున్నాడని, అవినీతిపరుడైన ఒక పెద్ద మనిషిని ఎదుర్కొనే పాత్రలో ఆయన కనిపిస్తాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాతో ఎస్.ఆర్.శేఖర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. నితిన్ జోడీగా కృతిశెట్టి కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement