ఇక ఎక్కడా ఆగకుండా హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లిపోవచ్చు!

10-09-2021 Fri 20:48
advertisement

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాలంటే మార్గమధ్యంలో దుబాయ్, అబుదాబి వంటి నగరాలకు చేరుకుని అక్కడ్నించి మళ్లీ ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు! హైదరాబాద్ నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎయిరిండియా నేటి నుంచి లండన్ కు నాన్ స్టాప్ సర్వీసులు ప్రవేశపెడుతోంది.

ఈ విమాన సర్వీసులు వారంలో రెండు పర్యాయాలు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ వెళతాయి. ఇవి హైదరాబాద్ నుంచి లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టుకు 9 గంటల్లో చేరుకుంటాయి. గతంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చాలా అధికంగా ఉండేది. ఇప్పుడు ఎంతో సమయం ఆదా కానుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement