నితిన్ 31వ సినిమాకి .. పవర్ఫుల్ టైటిల్!

10-09-2021 Fri 18:55
advertisement

చూస్తుండగానే నితిన్ 30 సినిమాలు పూర్తిచేశాడు. కెరియర్ పరంగా తనకి ఎదురైన ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాడు. కెరియర్ పరంగా ఎక్కడా గ్యాప్ రాకుండా, యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు. ఈ రోజు ఉదయం ఆయన 31వ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఎడిటర్ ఎస్.ఆర్.శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'మాచర్ల నియోజక వర్గం' టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. విధ్వంసం సృష్టించిన విలన్ గ్యాంగ్ తన వైపుకు దూసుకు వస్తుంటే, ధైర్యంగా వాళ్లకి ఎదురు నిలిచిన నితిన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

దాంతో ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు ఎక్కువేనని అర్థమవుతోంది. సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. 

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement