'18 పేజెస్' నుంచి అనుపమ ఫస్టు లుక్ రిలీజ్!

10-09-2021 Fri 17:44
advertisement

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా, '18 పేజెస్' సినిమా రూపొందింది. బన్నీవాసు - సుకుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే అందించినది సుకుమార్ కావడం విశేషం. 'వినాయక చవితి' పండుగ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ, ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను వదిలారు.

ఈ సినిమాలో 'నందిని' పాత్రలో అనుపమ కనిపించనుందనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. తన చేతిపై వాలిన అందమైన సీతాకోకచిలుకను చూస్తూ అనుపమ మురిసిపోయే ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆమెను మరింత అందంగా చూపించారనే విషయం పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాలో 'సిద్ధూ' పాత్రలో నిఖిల్ కనిపించనున్నాడు. ఇంతవరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని నిఖిల్ చెప్పడం విశేషం. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement