ర‌జ‌నీకాంత్ ‘అన్నాత్తే’ ఫస్ట్‌లుక్ అదుర్స్‌!

10-09-2021 Fri 13:37
advertisement

ర‌జ‌నీకాంత్ హీరోగా ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ వంటి తార‌లు కీలకపాత్ర‌ల్లో రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘అన్నాత్తే’ నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ లుక్ ను విడుద‌ల చేశారు. ఇందులో రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో స్టైలిష్‌గా కనప‌డుతోన్న తీరు అల‌రిస్తోంది.
 
దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్ 4న విడుద‌ల చేస్తున్న‌ట్లు ఈ పోస్ట‌ర్ లో ప్రకటించారు. సన్‌ పిక్చర్స్ పతాకంపై శివ దర్శ‌క‌త్వంలో యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. శ‌రవేగంగా షూటింగ్ ప‌నులు కొన‌సాగుతున్నాయి.  

             

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement