'లవ్ స్టోరీ' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

10-09-2021 Fri 10:35
advertisement

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' రూపొందింది. 'ఫిదా' మాదిరిగానే ఇది తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బరువైన కథ. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా యూత్ లో ఆసక్తిని పెంచుతూ వస్తోంది.

ఇక ఎప్పుడైతే 'సారంగధరియా' పాట వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాట, జానపద కథ అయిన 'సారంగధరుడు' నుంచి వచ్చిందనే అనుకోవాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తి ఈ పాటకు ఉంది అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, నిజానికి ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారనేది తాజా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement