విజయసాయి గత మూడు వారాలుగా ఇదే చెబుతున్నారు: మెమోపై ఈడీ అభ్యంతరం

09-09-2021 Thu 20:00
advertisement

హైదరాబాదులోని సీబీఐ-ఈడీ న్యాయస్థానంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నేడు కూడా కొనసాగింది. మొదట ఈడీ కేసులను విచారించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని విజయసాయి నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో విజయసాయిరెడ్డి దాఖలు చేసిన మెమోపై ఈడీ తాజాగా అభ్యంతరం చేసింది. సుప్రీంకు వెళతామంటున్న విజయసాయిరెడ్డి గత మూడు వారాలుగా ఇదే చెబుతున్నారని అసంతృప్తి వెలిబుచ్చింది. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధంగా ఉన్నామని ఈడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అభియోగాల నమోదుపై వాదనల కోసం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement