'వలిమై' వచ్చేది అప్పుడేనట!

02-09-2021 Thu 20:03
advertisement

తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రమైన 'వలిమై' షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి వదిలిన ప్రతి అప్డేట్ కి విపరీతమైన స్పందన వస్తోంది. అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుందనీ, రజనీ సినిమా 'అన్నాత్తే'తో పోటీ పడుతుందని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగానే సన్నాహాలు చేసుకుంటున్నారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. అజిత్ కొంతకాలంగా వరుస విజయాలతో ఉన్నాడు. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ అంతకుమించి అన్నట్టుగా ఉంటాయట.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement