తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని అనుకోలేదు: విజయసాయిరెడ్డి విసుర్లు
31-08-2021 Tue 21:08
- విపక్ష నేతలపై వ్యాఖ్యలు
- పార్టీ భవిష్యత్తు ఎల్లో మీడియా చేతిలో పెట్టారని వెల్లడి
- వాళ్ల కథలకు మురిసిపోతున్నారంటూ ట్వీట్
- ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపైనా విసుర్లు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. తండ్రీకొడుకులు ఇంత త్వరగా చేతులెత్తేస్తారని ఊహించలేదని వ్యాఖ్యానించారు. పచ్చపార్టీ భవిష్యత్తును ఎల్లో మీడియా చేతిలో పెట్టారని, మరోవిధంగా చెప్పాలంటే జీపీఏ రాసిచ్చారని ఎద్దేవా చేశారు. "వాళ్ల కథలకు మురిసిపోతూ ప్రజలను మర్చిపోయారు... రాజకీయ ముగింపు ఇలా సాగుతోంది" అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విజయసాయి ఉత్తరాంధ్ర టీడీపీ నేతలను కూడా టార్గెట్ చేశారు. సిగ్గూశరం లేని టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చావేదికలు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యఅతిథులుగా అశోక్, అచ్చెన్న అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలుగా మార్చిన ఘనులు వీరు అని ఆరోపించారు.
More Latest News
తండ్రి వయసున్న వ్యక్తిని పెళ్లాడాలని బలవంతం.. కాదన్నందుకు మెడిసిన్ విద్యార్థికి గుండు గీసి దురాగతం
17 minutes ago

పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత
50 minutes ago

విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయి.. శృంగారానికి పురుషుడితో పనిలేదు: టీవీ నటి కనిష్కా సోని
1 hour ago
