వచ్చే నెలలోనే సందడి చేయనున్న 'లవ్ స్టోరీ'

31-08-2021 Tue 10:07
advertisement

నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు. ఎమోషన్ పాళ్లు ఎక్కువ కలిసిన  ప్రేమకథ ఇది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతూ వచ్చింది.

ఈ సినిమాను 'వినాయక చవితి' పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఆ తరువాత కొన్ని కారణాల వలన విడుదల నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక వచ్చేనెల 24వ తేదీన గానీ ... 30వ తేదీన గాని ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే 'సారంగధరియా' పాట కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తిని రేపుతూనే ఉంది. దేవయాని కీలకమైన పాత్రలని పోషించిన ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రల్లో రావు రమేశ్ .. పోసాని కనిపించనున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement