'మాస్ట్రో' నుంచి స్నీక్ పీక్ రిలీజ్!

30-08-2021 Mon 12:01
advertisement

నితిన్ హీరోగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందింది. నికితా రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, కొంతకాలం క్రితం హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్'కి రీమేక్. నితిన్ జోడీగా నభా నటేశ్ నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక కీలకమైన పాత్రను పోషించింది.

ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'స్నీక్ పీక్'ను రిలీజ్ చేశారు. నితిన్ పియానో ప్లే చేస్తూ ఉండగా, అది రిపేర్ కి రావడం .. ఆయన అసహనానికి లోను కావడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

ఒక మర్డర్ కేసు చుట్టూ తిరిగే ఈ కథలో నితిన్ అంధుడిగా కనిపించనున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని నితిన్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement