తుపాకీతో బెదిరించి క్షణాల వ్య‌వ‌ధిలో చైన్‌ లాక్కెళ్లిన యువ‌కులు.. వీడియో ఇదిగో

28-08-2021 Sat 10:45
advertisement

ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న‌ ఓ మ‌హిళ‌ను న‌డిరోడ్డుపై అడ్డ‌గించిన ఇద్ద‌రు యువ‌కులు అంద‌రూ చూస్తుండ‌గానే ఆమెకు తుపాకీ చూపి బెదిరించి, ఆమె మెడ‌లోంచి గొలుసు లాక్కెళ్లారు. కొన్ని సెక‌న్ల‌లో ప‌ని కానిచ్చేసుకుని బైక్‌పై పారిపోయారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి.  

పాయింట్ బ్లాంక్‌లో గురిపెట్టి మ‌హిళ‌ మెడ‌లో నుంచి చైన్ లాక్కున్న తీరు క‌ల‌క‌లం రేపుతోంది. ఆ మ‌హిళ వెనుక ఆమె కుమారుడు ఉన్న‌ప్ప‌టికీ నిందితుల‌ను అడ్డుకోలేక‌పోయాడు. అక్క‌డి రోడ్డు మీద వెళ్లేవాళ్లు కూడా దుండ‌గుల‌ను ఆప‌లేక‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. త‌న కుమారుడిని మ‌హిళ ట్యూషన్ వ‌ద్ద విడిచిపెట్టేందుకు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పోలీసులు వివ‌రించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండ‌గుల‌ను గుర్తించేందుకు పోలీసులు ప్ర‌యత్నిస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement