హోం థియేటర్లో 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా చూసిన మహేశ్ బాబు
27-08-2021 Fri 22:03
- సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్'
- కరుణ కుమార్ దర్శకత్వం
- ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
- మహేశ్ బాబు సినిమా చూస్తున్న ఫొటో పంచుకున్న సుధీర్

సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రిలీజైంది. కాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించారు. మహేశ్ బాబు తన హోం థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్న ఫొటోను హీరో సుధీర్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుధీర్ బాబు... మహేశ్ బాబు బావ అన్న సంగతి తెలిసిందే. సినిమాల పరంగా వీరిరువురు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటుంటారు. తాజాగా సుధీర్ బాబు పంచుకున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
More Latest News
హాదీ మతార్... సల్మాన్ రష్దీపై దాడి చేసింది ఇతడే!
8 minutes ago

పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
3 hours ago
