నాగ్ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రీ లుక్!

27-08-2021 Fri 10:27
Nagarjuna new movie update

నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్ ను రివీల్ చేయకుండా ఈ ప్రీ లుక్ ను వదిలారు. పూర్తి బ్లాక్ కలర్ డ్రెస్ తో .. నెత్తుటి ధారలతో తడిసిన ఖడ్గం పట్టుకుని ఆయన వర్షంలో నడుస్తున్నట్టు ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

ఈ నెల 29వ తేదీన ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ ఉంటుందనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బహుశా అప్పుడు టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలే అవకాశం ఉంది. ఈ సినిమాలో నాగార్జున కొత్త లుక్ తో కనిపించనున్నారు. 'గరుడ వేగ' తరువాత ప్రవీణ్ సత్తారు చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ మధ్య కాలంలో నాగార్జున యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తున్నారు. అందుకు నిదర్శనంగా 'ఆఫీసర్' .. 'వైల్డ్ డాగ్' .. సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహాలో నిర్మితమవుతోంది. కాజల్  కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News
Somu Veerraju demands to reduce wine shop closing time
Pawan Kalyan questions AP Govt
Markets ends in losses
Modi gives directions to Varanasi BJP workers from NaMo APP
MP Raghurama Krishna Raju says he will protest against PRC decision
NTR death anniversary program at TDP Office
Vijayasanthi reacts on employees problems during transfers
One more petition filed against RRR
Employees unions opposed PRC
 Army new combat uniform triggers manufacturing contract battle
Sunil Gavaskar Has Doubt On Rohit Sharma For Test Captaincy
Four naxals died in encounter at Telangana and Chhattisgarh border
Revanth Reddy fires on KCR
rcb keen to take sreyas ayyar as a captain
The Rarest Black Diamond Which Comes From Interstellar
..more