'గల్లీ రౌడీ' రిలీజ్ డేట్ వాయిదా!

25-08-2021 Wed 18:39

Gully Rowdy movie update

సందీప్ కిషన్ హీరోగా 'గల్లీ రౌడీ' సినిమా రూపొందింది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాను వచ్చేనెల 3వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని, విడుదల తేదీని వాయిదా వేశారు.

ఆ రోజున ఎక్కువ సినిమాలు విడుదల కానుండటమే అందుకు కారణమని తెలుస్తోంది. 'నూటొక్క జిల్లాల అందగాడు' .. 'డియర్ మేఘ' సినిమాలు ఆ రోజునే విడుదల కానున్నాయి. ఇక అదే రోజున రావడానికి 'సీటీ మార్' కూడా సిద్ధమైంది. దాంతో ఇంత పోటీలో విడుదల చేయకూడదనే ఉద్దేశంతో, 'గల్లీ రౌడీ'ని వాయిదా వేసుకున్నారు.

అయితే ఈ సినిమాను వచ్చే నెలలోనే విడుదల చేయనున్నామనీ, త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు. సందీప్ కిషన్ సరసన నేహా శెట్టి నటించిన ఈ సినిమాలో, బాబీ సింహా - రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'జి. నాగేశ్వరరెడ్డి - సందీప్ కిషన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మాదిరిగా ఈ సినిమా హిట్ కొడుతుందేమో చూడాలి.  


More Telugu News
Telangana governor Tamilisai visits Sirivennela Sitharama Shastri family members
Yuvraj Singh set to surprise his fans this month
Kishan Reddy fires on TRS
Centre replies to TDP member Kanakamedala on AP Govt debts
Sachin Tendulkar daughter Sara turns as model for a clothing brand
Sabitha Indrareddy responds to corona cases in hostels
Vicky Kaushal and Kathrina Kaif wedding rules revealed
Shyam Singha Roy movie update
Akhilesh Yadav satires on BJP govt in Uttar Pradesh
Bangarraju Movie Update
Rohingyas files law suit against social media giant
Akhanda movie update
AP Daily Corona Update
Women with fake visas at Shamshabad airport
We will not afraid of KCR says Kishan Reddy
..more