కులాల వారీగా జనాభా లెక్కించండి: ప్రధాని మోదీని కోరిన నితీశ్
23-08-2021 Mon 16:06
- కులాల వారీగా జనగణనకు నితీశ్ మొగ్గు
- అఖిలపక్షంతో ఢిల్లీకి!
- ప్రధాని మోదీతో సమావేశం
- భేటీలో పాల్గొన్న తేజస్వి, ఇతర నేతలు
- మీడియా సమావేశంలో పక్కపక్కనే నితీశ్, తేజస్వి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ అఖిలపక్ష బృందంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దేశంలో కులాల వారీగా జనాభా లెక్కించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తమ ప్రతిపాదనను సావధానంగా విన్నారని నితీశ్ కుమార్ వెల్లడించారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
కాగా, మోదీతో భేటీకి సీఎం నితీశ్ కుమార్ తన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, ఇతర రాజకీయ పక్షాల నేతలతో కలిసి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు, మీడియా సమావేశంలోనూ నితీశ్, తేజస్వి ఒకరి పక్కన ఒకరు నిల్చున్నారు. కాగా, నితీశ్ అభిప్రాయాలను తాము సమర్థిస్తున్నామని, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా గణన చేయాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.
More Latest News
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
2 hours ago

వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!
3 hours ago

మనందరికీ ఏదో ఒక ఉమ్మడి అంశం ఉంటుంది... అదే మనందరినీ ఒకటిగా కలుపుతుంది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
4 hours ago

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే... ఫడ్నవీస్ కు హోం, ఆర్థిక శాఖలు
5 hours ago
