రష్యాలో 'వలిమై' షూటింగ్!

20-08-2021 Fri 10:34
advertisement

అజిత్ సినిమా వస్తుందంటే తమిళనాట సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఆయన అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అలాంటి అజిత్ తాజా చిత్రంగా 'వలిమై' రూపొందుతోంది. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనేక విశేషాలు చోటుచేసుకున్నాయి. అందువలన ఈ సినిమా అప్ డేట్స్ కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. చివరి షెడ్యూల్ ను 'రష్యా'లో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి అక్కడ కొన్ని రోజుల పాటు షూటింగు జరగనుంది. అజిత్ తో పాటు ప్రధాన పాత్రల కాంబినేషన్లో  కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాంతో షూటింగు పార్టు పూర్తవుతుంది.

బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రను కార్తికేయ పోషించాడు. యువన్ శంకర్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. 'దీపావళి' కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement