పూణేలో మోదీ గుడి నుంచి విగ్రహం తొలగింపు!

19-08-2021 Thu 20:56
advertisement

మహారాష్ట్రలోని పూణేలో ఒక బీజేపీ కార్యకర్త ప్రధాన మంత్రి మోదీకి గుడి కట్టాడు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తున్న వ్యక్తికి గుడి ఉండాలనే భావనతోనే తాను ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పూణేకు చెందిన 37 ఏళ్ల మయూర్ ముండే చెప్పారు. దీనికితోడు ట్రిపుల్ తలాక్ రద్దు, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు కూడా ఈ ఆలయ నిర్మాణానికి కారణాలేనని చెప్పాడు. ఈ గుడి కోసం ఆయన రూ. 1,60,000 వెచ్చించాడు. 

 అయితే, ఈ గుడి విషయం మీడియాలో రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఇది ఆమోదయోగ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆలయంలోని మోదీ విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ విగ్రహం స్థానిక బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో ఉన్నట్లు సమాచారం.

కాగా, పూణేలో వచ్చే ఏడాది ప్రారంభంలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ కార్యకర్తలు గురువారం ఈ గుడికెళ్లి ‘భోగ్’ (ప్రసాదం) సమర్పిస్తామని ప్రకటించారు. ఈ రాజకీయాలు మరింత తీవ్రరూపం దాల్చకముందే ఆలయంలోని మోదీ విగ్రహాన్ని తొలగించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement