చెర్రీకి కోపమొచ్చిన వేళ.. ఇన్​ స్టాలో వీడియో పోస్ట్​ చేసిన ఎన్టీఆర్​!

09-08-2021 Mon 13:32
advertisement

చెర్రీకి కోపమొచ్చింది.. అవును, నిజమే! తారక్ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరిగా రాంచరణ్ లు 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఇద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో చెర్రీ ‘అసహనానికి’ లోనయ్యాడు. దానికి సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్’లో ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు.

ఎన్టీఆర్ లోపలికి వస్తూ.. ‘చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిపోయిందా?’ అని అడిగాడు. అందుకు చరణ్.. టేబుల్ మీద దరువేసి ‘ఆ.. ఇదిగో అయిపోయింది’ అంటూ బదులిచ్చాడు. కొంత అసహనంతో (ఫన్నీగా) డ్రమ్స్ ఏవి కార్తికేయ?.. పొద్దుపొద్దునే ఇక్కడ కూర్చోపెట్టారంటూ రాజమౌళి కుమారుడిపై సరదాగా ఆగ్రహం కనబరిచాడు. ‘వస్తున్నాయి.. వస్తున్నాయి.. రెండు నిమిషాలు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు కార్తికేయ. ఇంకెప్పుడు..? దసరాకే సినిమా రిలీజ్ చేయాలి కదా? అంటూ చెర్రీ కూడా మరోసారి సరదా కామెంట్ చేశాడు.

కాగా, ఇవాళ్టి నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి ప్రతి అప్ డేట్ ను ‘ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్’లో ఎన్టీఆర్ పోస్ట్ చేస్తాడని చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇవాళ ఇన్ స్టాలో చెర్రీ వీడియోను ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. ఫస్ట్ పోస్ట్ బై భీమ్ అంటూ ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ టీం అప్ డేట్ ఇచ్చింది. మీరూ ఈ వీడియోను ఓ లుక్కేసేయండి మరి!

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement