సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

05-08-2021 Thu 07:26
advertisement

*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' పేరిట ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయిక ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేస్తోందట. నందిని, మందాకినీ అనే పాత్రలను ఐష్ పోషిస్తున్నట్టు చెబుతున్నారు.
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ' షూటింగు గత కొన్ని రోజులుగా పుదిచ్చేరిలో జరుగుతోంది. ఈ నెల 10వ తేదీతో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. బాలయ్య రెండు పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  తమిళ కథానాయకుడు ధనుష్ తన 44వ చిత్రాన్ని మిత్రన్ జవహర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement