హైదరాబాదులో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాల మూసివేత
31-07-2021 Sat 21:12
- బోనాల నేపథ్యంలో నిషేధాజ్ఞలు
- ఆదివారం ఉదయం 6 గంటల నుంచి అమలు
- మంగళవారం ఉదయం 6 గంటల వరకు మూసివేత
- మద్యం దుకాణాలకు పోటెత్తిన మందుబాబులు

బోనాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాదులో రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నోటిఫికేషన్లు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాల మూసివేత అమల్లో ఉంటుంది.
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ఎవరైనా మద్యం, కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, మద్యం దుకాణాల మూసివేత నేపథ్యంలో, ఎప్పట్లాగానే మందుబాబులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మద్యం దుకాణాలకు పోటెత్తారు.
More Latest News
తెలంగాణలో తాజాగా 435 మందికి కరోనా పాజిటివ్
50 minutes ago

బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
1 hour ago

టాలీవుడ్ వాళ్లు షూటింగులు ఆపేసి ఏం చేస్తున్నారని బాలీవుడ్ వాళ్లు ఆరా తీస్తున్నారు: దిల్ రాజు
3 hours ago

ఈ నెల 25న 'జిన్నా' టీజర్ రిలీజ్!
4 hours ago

మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం
4 hours ago
