సంక్రాంతికి 'ఎఫ్ 3' రావడం ఖాయమే!

31-07-2021 Sat 12:46
advertisement

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టినప్పుడే, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాంతో అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

పరిస్థితులు అనుకూలించిన తరువాత ఇటీవలే మళ్లీ షూటింగును మొదలుపెట్టారు. అయితే షూటింగు విషయంలో జాప్యం జరిగిన కారణంగా ఈ సినిమా సంక్రాంతికి థియేటర్లకు రాకపోవచ్చుననే ఒక ప్రచారం జరుగుతోంది. తాజాగా వెంకటేశ్ మాట్లాడుతూ, ఆ ప్రచారానికి తెరదించారు.  

నిన్న సాయంత్రం జరిగిన 'నారప్ప' సినిమా సక్సెస్ మీట్ లో వెంకటేశ్ మాట్లాడారు. 'నారప్ప' .. థియేటర్లలో రానందుకు అభిమానులు బాధపడొద్దనీ, 'ఎఫ్ 3' సినిమా సంక్రాంతికి థియేటర్లలోనే వస్తుందని అన్నారు. అప్పుడు అందరం కలిసి సందడి చేద్దాం అని చెప్పారు. దాంతో ఆయన ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమేననే విషయాన్ని స్పష్టం చేసినట్టు అయింది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement