సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

31-07-2021 Sat 07:38
advertisement

*  ప్రస్తుతం పలు తెలుగు సినిమాలలో నటిస్తున్న కథానాయిక నభా నటేష్ కు లక్కీ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు దక్కింది. హృతిక్ చేయనున్న ఓ వెబ్ సీరీస్ లో నభా నటేష్ ను నాయిక పాత్రకు ఎంచుకున్నట్టు సమాచారం.
*  బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కున్న క్రేజే వేరు. ప్రస్తుతం వీరి కలయికలో రూపొందుతున్న 'అఖండ' చిత్రానికి కూడా మొదటి నుంచీ ఎంతో క్రేజ్ వుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 40 కోట్ల వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం చివరి షెడ్యూలు షూటింగ్ ఆగస్టు 2 నుంచి ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూలులో సన్నివేశాలతో పాటు ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లపై ఓ భారీ సాంగును కూడా అక్కడ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఆగస్టు రెండో వారం వరకు అక్కడ ఈ షెడ్యూలు జరుగుతుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement