పక్కా ప్లానింగుతో 'ప్రాజెక్టు K' షూటింగ్!

28-07-2021 Wed 12:51
advertisement

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక సినిమా చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల్ షూట్ ను ఇప్పటికే హైదరాబాదు .. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. ఎక్కడెక్కడ తమకి ఏవేవి అవసరం పడతాయనేది చూసుకున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో ... ప్రతి అంశంలో నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ వచ్చారు. తనకి ఉన్న సమయాన్ని ఎంతమాత్రం వదులుకోకుండా ఈ ప్రాజెక్టుపైనే పెట్టానని ముందునుంచే ఆయన చెబుతూ వస్తున్నారు. అదే ప్లానింగుతో ఆయన ముందుకు వెళుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమా కావడం వలన 90 శాతం షూటింగును ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరించాలనే నిర్ణయానికి ఆయన వచ్చారని అంటున్నారు.

కేవలం ఓ 10 శాతం షూటింగు మాత్రమే బయట చేయవలసి ఉంటుందట. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, షూటింగు జరిగేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడని, అలాగే సాధ్యమైనంత వేగంగా ఈ సినిమా షూటింగు జరిగేలా చూస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement