కడప జిల్లాలో దారుణం.. వైసీపీ సర్పంచ్ హత్య

28-07-2021 Wed 06:46
advertisement

సర్పంచ్ శిక్షణ తరగతులకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ సర్పంచ్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. కడప జిల్లా లింగాల మండలం కోమనూతలలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసింది. వైసీపీకి చెందిన సర్పంచ్ మునెప్ప (50) శిక్షణ తరగతులకు హాజరై  బైక్‌పై వస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది.

గ్రామ శివారులో ఆయనను అడ్డుకున్న ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఆధిపత్య పోరే ఈ హత్యకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మునెప్ప 150 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement