చివరి షెడ్యూల్ షూట్ లో రవితేజ!

26-07-2021 Mon 17:48
advertisement

రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. ఈ లోకంలో కేటుగాళ్ల మధ్య బ్రతకాలంటే ఖిలాడీలా మారవలసిందే అని చెప్పే కథ ఇది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు బ్యాలెన్స్ ఉండగా, రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే 'ఖిలాడి' షెడ్యూల్స్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం పట్ల రవితేజ అసహనాన్ని వ్యక్తం చేయడం వలన షూటింగు ఆగిపోయిందనే వార్తలు షికారు చేశాయి.

దాంతో వెంటనే 'ఖిలాడి' మేకర్స్ స్పందిస్తూ ఈ నెల 26వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుందని చెప్పారు. అలాగే ఈ రోజున ఉదయం ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు మొదలైంది. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అలరించనున్న ఈ సినిమా, దసరాకు ముందే ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement