షూటింగుకు రెడీ అవుతున్న 'లూసిఫర్' రీమేక్

26-07-2021 Mon 10:11
advertisement

చిరంజీవి ఇప్పుడు వరుస రీమేకులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ఆచార్య ' సినిమా షూటింగు పూర్తికాగానే, ఇక వరుసగా ఆయన మూడు భారీ రీమేకులు చేయనున్నారు. వాటిలో 'లూసిఫర్' ముందు వరుసలో ఉంది. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లూసిఫర్' అక్కడ భారీ విజయాన్ని సాధించింది.

ఈ సినిమా మోహన్ లాల్ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలవడమే కాకుండా, వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. దాంతో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి చిరంజీవి ఆసక్తిని చూపించారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తమిళ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో స్వల్పమైన మార్పులు చేశారు.

వచ్చేనెల 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వేయిస్తున్న భారీ సెట్ పూర్తికావొచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ చెల్లెలి పాత్రలో మంజువారియర్ నటించింది. తెలుగులో ఆ పాత్ర కోసం సుహాసినిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement