మాన్సాస్ ట్రస్టు ఈవో సహకరించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతిరాజు

24-07-2021 Sat 15:49
advertisement

మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలు మరోసారి రచ్చకెక్కాయి. మాన్సాస్ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు సహకరించడంలేదని మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఈవో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడంలేదని పిటిషన్ లో తెలిపారు. అశోక్ గజపతిరాజు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ ను సీజేకి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దాన్ని ఏ బెంచ్ విచారణ జరపాలలేది సీజే నిర్ణయిస్తారని పేర్కొంది. రేపు ఆదివారం కావడంతో ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement