సరదాగా సందడి చేస్తున్న 'ఒకే ఒక జీవితం' టీమ్!

22-07-2021 Thu 17:54
advertisement

శర్వానంద్ చాలా తక్కువ గ్యాపులో మూడు ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లిన ఆయన, 'మహాసముద్రం' సినిమాను చేస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకుంది. మరో హీరోగా సిద్ధార్థ్ నటిస్తున్న ఈ సినిమా, సముద్రం నేపథ్యంలోనే నడుస్తుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను, సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

కొత్త దర్శకుడైన శ్రీ కార్తీక్ కి శర్వానంద్ అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందుతోంది. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది. వెన్నెల కిషోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీమ్ ఫొటోను షేర్ చేసిన శర్వానంద్, ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా రాసుకొచ్చాడు.

ఇక ఈ సినిమాతో పాటు శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను కూడా చేస్తున్నాడు. కిషోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా శర్వానంద్ జోడీగా రష్మిక కనిపించనుంది. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్  నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మొత్తానికి వివిధ రకాల జోనర్లలో శర్వానంద్ నంచి వరుస సినిమాలు రానున్నాయన్న మాట!  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement