'పుష్ప' కోసం రెడీ అవుతున్న ఫాహద్ ఫాజిల్!

22-07-2021 Thu 10:22
advertisement

ఫాహద్ ఫాజిల్ .. మలయాళంలో గొప్పనటుడు .. అక్కడ ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అయితే తన కెరియర్ ను ఆరంభించిన చాలాకాలం తరువాతనే ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ మధ్యనే తెలుగు ప్రేక్షకులకు ఆయన ఎవరనేది తెలిసింది. కొన్ని అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కొంత చేరువైన ఆయన, 'పుష్ప'తోనే నేరుగా ఇక్కడి వారిని పలకరించనున్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించనున్నాడు.

ఈ పాత్రను సుకుమార్ డిజైన్ చేసిన తీరు నచ్చడం వల్లనే ఫాహద్ ఫాజిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమా షూటింగు కోసం కొన్ని రోజుల క్రితం ఆయన హైదరాబాద్ వచ్చాడు. అయితే ఆ సమయంలో కరోనా ఎక్కువగా ఉండటంతో తిరిగి వెళ్లిపోయాడు. రీసెంట్ గా మళ్లీ ఆయన హైదరాబాద్ వచ్చాడు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా షూటింగు ఆలస్యమవుతోంది. ప్రస్తుతం ప్లాన్ చేసిన సన్నివేశాలే ఈ షెడ్యూల్లో పూర్తి చేసే పరిస్థితి లేదు.

అందువలన ఆగస్టు నుంచి ఫాహద్ ఫాజిల్ సీన్స్ ను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారట. హైదరాబాదులో కొన్ని రోజులు, మారేడుమిల్లి ఫారెస్టులో కొన్ని రోజులు జరిగే షూటింగులో ఆయన పాల్గొంటాడని అంటున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత, తెలుగులో ఈ తరహా పాత్రల్లో ఆయన బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement