'విరాటపర్వం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

21-07-2021 Wed 12:03
advertisement

రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా సాయిపల్లవి నటించింది. సురేశ్ బాబు -  సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, వేణు ఊడుగుల దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 1990లో మావోయిస్టుల పోరాటానికి సంబంధించిన కథతో ఆయన ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్'లో విడుదల చేయనున్నారనీ, అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వచ్చింది.

తాజాగా ఈ విషయంపై దర్శకుడు వేణు ఊడుగుల స్పందించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ మరో నాలుగు రోజుల్లో పూర్తవుతుందని అన్నాడు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే పట్టుదలతోనే నిర్మాతలు ఉన్నారనీ, థియేటర్లు ఓపెన్ అయిన తరువాత, పరిస్థితులు చూసుకుని రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం జరుగుతుందని చెప్పాడు. 'అరణ్య' తరువాత రానా నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement