బోనాల ఉత్సవాలకు రావాలంటూ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించిన మంత్రి తలసాని

20-07-2021 Tue 20:22
advertisement

భాగ్యనగరంలో బోనాల సీజన్ నడుస్తోంది. గత కొన్నివారాలుగా బోనాల పండుగను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానించారు. ఉజ్జయిని మహంకాళి దేవస్థానం తరఫున సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ సురిటి కామేశ్వర్, అసిస్టెంట్ కమిషనర్ గుత్తా మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఉన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement