థియేటర్లకే తేజ సజ్జ 'ఇష్క్'.. రిలీజ్ డేట్ ఖరారు!

20-07-2021 Tue 18:41
advertisement

యువ కథానాయకులలో తేజ సజ్జ తన జోరు పెంచుతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'జాంబిరెడ్డి' విజయాన్ని సాధించడంతో, ఆ తరువాత నుంచి తేజ మరింత బిజీ అయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే 'హనుమాన్' అనే మరో సినిమా చేస్తున్నాడు. ఇక కొంతకాలం క్రితమే ఆయన 'ఇష్క్.. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా చేశాడు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి వెళ్లనుందనే టాక్ కూడా వినిపించింది.అలాంటి ఈ సినిమా థియేటర్లలోనే రానుంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఎస్.ఎస్.రాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో తేజ జోడిగా ప్రియా ప్రకాశ్ వారియర్ అలరించనుంది. కొంతకాలంగా ఆమె తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో ఆమె నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.    

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement