ఎలుకలు కొట్టేసిన రూ. 2 లక్షలలో దక్కింది రూ. 44 వేలే.. అందించిన ఆర్‌బీఐ

20-07-2021 Tue 07:13
advertisement

కడుపులో కణతికి ఆపరేషన్ చేయించుకునేందుకు దాచుకున్న డబ్బులు ఎలుకలపాలైన ఘటనలో బాధితుడికి రూ. 44 వేలు మాత్రమే దక్కాయి. తెలంగాణలోని మహబూబాబాద్‌కు చెందిన రెడ్యా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు కడుపులో కణతి ఉండడంతో ఆపరేషన్ కోసం రూ. 2 లక్షలు దాచుకోగా, వాటిని ఎలుకలు కొరికిపడేశాయి. దీంతో లబోదిబోమన్న రెడ్యా స్థానిక బ్యాంకులకు వెళ్లగా, వారు హైదరాబాద్‌లోని ఆర్‌బీఐకి వెళ్లమని సూచించారు.

ఈ విషయం తెలిసిన కలెక్టర్ వీపీ గౌతమ్ ఎలుకలు కొరికిన డబ్బులో నంబర్లు ఉన్న వాటిని గుర్తించాలని తహసీల్దార్ రంజిత్ కుమార్‌ను ఆదేశించారు. నంబర్లు ఉన్న 88 నోట్లను గుర్తించిన తహసీల్దార్ వీఆర్ఏ రాజశేఖర్‌ను తోడుగా ఇచ్చి రెడ్యాను నిన్న ఆర్‌బీఐకి పంపారు. ఆ నోట్లను పరిశీలించిన అధికారులు మొత్తం రూ. 44 వేలు చెల్లించారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement