చరణ్ సినిమా కోసం మొదలైన తమన్ కసరత్తు!

19-07-2021 Mon 11:50
advertisement

భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. శంకర్ సినిమా ప్రధమ లక్షణంగా కనిపిస్తుంది. తన సినిమాల విషయంలో శంకర్ ఎంతమాత్రం తొందరపడరు. చాలా కూల్ గా తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చేవరకూ ఆయన చిత్రీకరణ కొనసాగిస్తూ వెళుతుంటారు. ఈ క్రమంలో ఆయన ఈ సారి, నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. చరణ్ కథానాయకుడిగా .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

హీరోగా చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, నిర్మాతగా దిల్ రాజుకి 50వ సినిమా. సాధారణంగా శంకర్ తన సినిమాలకు ఏఆర్ రెహ్మాన్ తో గానీ .. అనిరుధ్ తో గాని పాటలు చేయించుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ సారి ఆయన ఈ సినిమాకి తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలకు వీరు శ్రీకారం చుట్టారు. గతంలో చరణ్ సినిమాలకు తమన్ అందించిన పాటలు యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. దాంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.    

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement