'రామారావు' కోసం రంగంలోకి దిగిన హీరోయిన్లు!

19-07-2021 Mon 11:13
advertisement

రవితేజ కథానాయకుడిగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. రవితేజ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అవినీతిపరుల ఆటకట్టించే 'సబ్ కలెక్టర్' గా రవితేజ ఇందులో కనిపించనున్నాడు. ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా వాళ్లు ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, ఈ సినిమా టీమ్ పోస్టర్స్ ను వదిలింది.'మజిలీ' సినిమాతో దివ్యాన్ష కౌశిక్ పరిచయమైంది. అందువలన తెలుగు ప్రేక్షకులకు ఆమె బాగానే తెలుసు. ఇక రజీషా విజయన్ కి మాత్రం తెలుగులో ఇదే మొదటి సినిమా. ఈ మధ్యనే ఆమె మలయాళ సినిమాల్లో కథానాయికగా కుదురుకుంది. ఇక 'కర్ణన్' సినిమాతో తమిళ చిత్రపరిశ్రమకి పరిచయమైంది. ఇప్పుడు తెలుగులోనూ ఎంట్రీ ఇస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ లోగానే రవితేజ 'ఖిలాడి' సినిమాతో సందడి చేయనున్నాడు.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement