సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

19-07-2021 Mon 07:12
advertisement

*  అందాలతార తమన్నా ఇకపై బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించనుంది. ఆమె తొలిసారిగా పాల్గొంటున్న 'మాస్టర్ చెఫ్ తెలుగు' షో వచ్చే నెల మూడో వారం నుంచి జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది. ఇందుకు సంబంధించిన పలు ఎపిసోడ్లను ఇప్పటికే చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
*  అక్కినేని నాగ చైత్యన్య హీరోగా ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తాడు. ఇప్పటికే ఈ చిత్రకథను నిర్మాత ఓకే చేసినట్టు సమాచారం.
*  తాజాగా 'నారప్ప' చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీకాంత్ అడ్డాల త్వరలో గీతా ఆర్ట్స్ నిర్మించే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం పేరు 'అన్నాయ్'. మూడు భాగాలుగా తెరకెక్కించే ఈ చిత్రం గుంటూరు ప్రాంతం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ప్రధానంగా నడుస్తుందట.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement