భారత్‌, శ్రీలంక మ‌ధ్య నేడు తొలివ‌న్డే జ‌రిగేనా?

18-07-2021 Sun 12:21
advertisement

భారత్‌, శ్రీలంక మ‌ధ్య మ‌రికాసేపట్లో ప్రారంభం కావాల్సిన తొలి వన్డే మ్యాచుకు వ‌రుణుడు ఆటంకం క‌లిగించే అవ‌కాశం ఉంది. ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే, ఆ ప్రాంతంలో మేఘాలు క‌మ్ముకోవ‌డంతో మ్యాచు ర‌ద్ద‌య్యే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అంతేగాక మైదానం కూడా సముద్ర తీరంలోనే ఉంటుంది. ఆ ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉండటంతో బంతి స్వింగ్‌ అయ్యేందుకు అవకాశాలు ఉన్నట్లు విశ్లేష‌కులు చెబుతున్నారు.

 శ్రీలంకతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్‌ ధావన్ వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు తొలి వ‌న్డే జ‌ర‌గాల్సి ఉంది. అలాగే, ఈ నెల  20, 23న మిగిలిన రెండు వన్డేలు జ‌రుగుతాయి. అనంత‌రం టీ20 మ్యాచులు ప్రారంభ‌మ‌వుతాయి. వ‌న్డేలు షెడ్యూల్ ప్ర‌కారం మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభ‌మ‌వుతాయి.  అలానే టీ20లు ఆయా తేదీల్లో రాత్రి 8 గంటలకి ప్రారంభం కానున్నాయి.


Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement