రీ షూట్ కి వెళ్లనున్న పవన్ సినిమా?

17-07-2021 Sat 18:52
advertisement

పవన్ కల్యాణ్ వరుసగా ఒప్పుకున్న సినిమాల్లో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ఒకటి. మలయాళంలో చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలను అందుకుంది. దాంతో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. లాక్ డౌన్ కి ముందు ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రీ షూట్ చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ల ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. దాంతో ఆయన స్థానంలోకి రవిచంద్రన్ ను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. మళ్లీ మొదటి నుంచి చిత్రీకరణ చేయడమే మంచిదనే అభిప్రాయంతో, దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయాలనుకున్నారు. మరి రీ షూట్ ప్రభావం రిలీజ్ పై పడుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ 'హరి హర వీరమల్లు' చేస్తున్న సంగతి తెలిసిందే.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement