సూర్య బర్త్ డే స్పెషల్ గా రానున్న ఫస్టులుక్!

17-07-2021 Sat 18:17
advertisement

సూర్య కథానాయకుడిగా పాండిరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా సూర్యకి ఇది 40వ సినిమా. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఎనౌన్స్ చేయలేదు .. ఫస్టులుక్ ను వదల్లేదు. దర్శకుడిగా పాండిరాజ్ కి మంచి ఇమేజ్ ఉంది .. ఇక హీరోగా సూర్యకి గల క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఈ నెల 23వ తేదీన సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నారట.ఇక ఈ సినిమాతో సూర్య మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఆ సినిమాల్లో వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. విభిన్నమైన కథాకథనాలను తెరకెక్కించే దర్శకుడిగా వెట్రిమారన్ కి మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'వాడి వాసల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిన్న రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కథాకథనాలు ఏమై ఉంటాయనేది అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement