ద్విపాత్రాభినయం చేయనున్న రామ్ చరణ్?

17-07-2021 Sat 16:51
advertisement

కొన్ని కాంబినేషన్లకు సినిమా ఎనౌన్స్ మెంట్ నుంచే విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటిదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సూపర్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్. ఈ కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రకటించగానే ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత వచ్చేసింది. చిరంజీవి, శంకర్ ల కాంబోలో సినిమా చూడాలని ఆశపడిన మెగా అభిమానులకు ఆ కోరిక నెరవేరకపోవడంతో ఇప్పుడు చిరంజీవి తనయుడు చరణ్ ఆ దర్శకుడితో నటిస్తుండడంతో మెగా ఫ్యాన్స్ జోష్ తో వున్నారు.

ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని కూడా అంటున్నారు. అలాగే వివిధ కీలక పాత్రలకు వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను ఎంచుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా విశేషం ఒకటి వినిపిస్తోంది. అదేమిటంటే, ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. రెండు పాత్రలనూ శంకర్ డిఫరెంట్ గా డిజైన్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement