ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
17-07-2021 Sat 14:33 | Telangana
- ప్లాట్ 17పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం
- ఉత్తర్వులకు లోబడే వేలం ఉండాలని టీఎస్ఐఐసీకి సూచన
- తమ పూర్వీకుల సమాధులున్నాయంటూ నలుగురి పిటిషన్

హైదరాబాద్ ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు స్పందించింది. అందులోని ప్లాట్ నం.17పై నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్లాట్ లోని భూముల్లో తమ పూర్వీకుల సమాధులున్నాయని పేర్కొంటూ దానిపై జరిగిన వేలాన్ని నిలుపుదల చేయాల్సిందిగా నలుగురు స్థానికులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
నిన్న జరిగిన వేలంలో 14.9 ఎకరాలకుగానూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కి రూ.729 కోట్ల ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ నలుగురు వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ప్లాట్ 17పై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే వేలం ఉండాలని టీఎస్ఐఐసీని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
More Latest News
'వసంత కోకిల' ట్రైలర్ పై స్పందించిన మెగాస్టార్!
29 minutes ago

అక్బరుద్దీన్ ఒవైసీని కలవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరణ
40 minutes ago

టర్కీలో మళ్లీ భూకంపం... వేలల్లో మృతుల సంఖ్య!
2 hours ago

బాలయ్య చీఫ్ గెస్టుగా 'వేద' ప్రీ రిలీజ్ ఈవెంట్!
3 hours ago

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బండి సంజయ్ స్పందన
3 hours ago

'బుట్టబొమ్మ' (మండే టాక్)
3 hours ago
