గుజరాత్ హైకోర్టు లైవ్ స్ట్రీమింగ్ ను ఈరోజు ప్రారంభించనున్న సీజేఐ ఎన్వీ రమణ

17-07-2021 Sat 13:51
advertisement

భారత న్యాయవ్యవస్థలో ఈరోజు చరిత్రపుటల్లోకి ఎక్కబోతోంది. గుజరాత్ హైకోర్టులో వాదనలను అధికారికంగా లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం 5.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించబోతున్నారు. ఇదే సందర్భంగా... గుజరాత్ హైకోర్టు లైవ్ స్ట్రీమింగ్ రూల్స్ 2021ని ఆయన విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ గౌరవ అతిథిగా, జస్టిస్ ఎంఆర్ షా ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

2020 అక్టోబరులో లైవ్ స్ట్రీమింగ్ ను గుజరాత్ హైకోర్టు ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రయోగాత్మక కార్యక్రమం కొనసాగుతోంది. ఆ కార్యక్రమం దాదాపు 8 నెలలకు పైగా విజయవంతంగా కొనసాగింది. గుజరాత్ హైకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయిన వాదనలకు 41 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ యూట్యూబ్ ఛానల్ కు 65 వేలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement