"ఓ నారప్ప"... వెంకటేశ్ కొత్త చిత్రం నుంచి హుషారైన గీతం విడుదల
16-07-2021 Fri 16:35
- వెంకటేశ్, ప్రియమణి జంటగా నారప్ప
- తమిళ చిత్రం అసురన్ కు రీమేక్
- జులై 20న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్
- దుమ్మురేపుతున్న ట్రైలర్

తమిళ చిత్రం అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప చిత్రం నుంచి ఓ హుషారైన గీతం నేడు విడుదలైంది. ఓ నారప్ప అనే గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ పాటను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ చిత్రంలో వెంకటేశ్, ప్రియమణి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేశ్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జులై 20న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికపై విడుదల కానుంది. రెండ్రోజుల కిందట విడుదలై నారప్ప ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. వెంకటేశ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
More Latest News
ఆరోగ్య బీమా ఏ వయసులో తీసుకోవాలి..?
11 minutes ago

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
34 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
55 minutes ago

నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
58 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago
