మోషన్ పోస్టర్ తోనే కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న 'వలిమై'

12-07-2021 Mon 17:47
advertisement

అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో 'వలిమై' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా ముగింపుదశకి చేరుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను వదిలారు. 17 గంటల్లోనే ఈ పోస్టర్ 7మిలియన్స్ వ్యూస్ ను .. 1 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుని, కొత్త రికార్డును సృష్టించింది. ఫస్టులుక్ విషయంలోనే ఈ సినిమా అంచనాలు పెరిగిపోవడం విశేషం.తమిళనాట అజిత్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే, పెద్ద పండుగ వస్తున్నట్టుగా సందడి చేస్తుంటారు. అజిత్ వరుస విజయాలతో ఉండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. సహజంగానే అజిత్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాలో అంతకు మించి ఉంటాయని చెబుతున్నారు.  హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు. 'దీపావళి'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement