తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం?: పవన్ కల్యాణ్
10-07-2021 Sat 18:32
- తెలుగు అకాడెమీ పేరు మార్పు
- తెలుగు-సంస్కృత అకాడెమీగా నామకరణం
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ఎందుకు మార్చారో వివరణ ఇవ్వాలన్న పవన్

తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు భాష వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్నే దూరం చేసేలా పేరు మార్చారని పవన్ విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలుగు అకాడెమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం ద్వారా ఏం సాధించారని నిలదీశారు.
More Latest News
చారిత్రక నేపథ్యంలో మహేశ్ బాబు మూవీ!
19 minutes ago

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు!
29 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి!
31 minutes ago

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక బహుమతులు
40 minutes ago

హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం.. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
50 minutes ago

నేను బీజేపీ మనిషిని.. బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తిని: మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
1 hour ago

'పుష్ప 2'లో మరో హీరోయిన్ పాత్ర అదేనట!
1 hour ago
