రౌతులపూడిలో జగన్ ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపింది: యనమల
09-07-2021 Fri 20:14
- విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలు
- పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు
- మీడియా సమావేశం ఏర్పాటు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- టీడీపీ నేతల అరెస్ట్ అనైతికమన్న యనమల

విశాఖ మన్యం ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రౌతులపూడి వద్ద మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం అనైతికం అని వ్యాఖ్యానించారు. విపక్ష నేతల వాక్ స్వాతంత్ర్యాన్ని జగన్ ప్రభుత్వం హరిస్తోందని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడినా అరెస్టు చేసే కొత్త సంప్రదాయానికి తెరలేపారని యనమల విమర్శించారు. జగన్ పాలనలో ఏపీ మరో ఉత్తర కొరియాలా మారుతోందని అన్నారు. టీడీపీ నేతలపై నమోదు చేసిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
More Latest News
పండంటి కవలలకు జన్మనిచ్చిన సినీ నటి నమిత
25 minutes ago

రాజస్థాన్ ప్రభుత్వం సంచలన పథకం.. రాష్ట్రంలోని మహిళలందరికీ సెల్ఫోన్లు, ఇంటర్నెట్ ఉచితం!
45 minutes ago

విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రగతి సాధించాయి.. శృంగారానికి పురుషుడితో పనిలేదు: టీవీ నటి కనిష్కా సోని
1 hour ago
